ఆర్టీసీ ఉద్యోగులను నిండా ముంచిన ఆన్‌లైన్‌ గొలుసుకట్టు పెట్టుబడుల స్కాం

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట క్వాంట్ వెస్ట్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పేరుతో ఆర్టీసీలో వందల మంది ఉద్యోగులతో గొలుసుకట్టు పెట్టుబడులు పెట్టించి భారీగా మోసాలకు పాల్పడ్డారు. కొందరు సీనియర్ అధికారులు, ఉద్యోగుల మభ్యపెట్టడంతో బాధితులు లక్షలాది రూపాయలు పోగొట్టుకుని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గుంటూరు, విజయవాడ మరియు అమరావతి ప్రాంతాల్లో ఈ అక్రమ ట్రేడింగ్ వ్యవహారం కలకలం రేపింది.