ఆకాశంలో ఒక తార చిత్రం: రాధే రాధే పాట ప్రత్యేక వీడియో విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
వర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆకాశంలో ఒక తార చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తో కలిసి దుల్కర్ సల్మాన్ రాధే రాధే పాటను ఆలపించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నవంబర్ ఇరవయ్యవ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది.