కేంద్రం పింఛన్ల వాటా జమపై లబ్ధిదారుల్లో ఆందోళన తీవ్రం
రిపోర్టర్: సతీష్
స్థలం: సంగం
రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తుండగా కేంద్రం తన వాటా నిధులను అక్టోబరు 1 నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది. అయితే ఖాతాలు ఎన్పీసీఐకి అనుసంధానమై ఉండడం తప్పనిసరి కావడం, వరుస బ్యాంకు సెలవులు వస్తుండడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు మొదలయ్యాయి. సంగం మండలంతో పాటు జిల్లావ్యాప్తంగా కొత్త ఖాతాల ప్రారంభం, పునరుద్ధరణపై స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.