విశాఖలో మాజీ పారామిలిటరీ జవాన్ల సంక్షేమ మండలి కీలక సమావేశం
రిపోర్టర్: GANESH BBL
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ కమాండెంట్ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల మాజీ పారామిలిటరీ జవాన్ల సంక్షేమ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ సభ్యులు కమాండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి జిల్లాలో సిజిహెచ్ఎస్ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, రిటైర్డ్ జవాన్లకు రేషన్, మద్యం సరఫరాలో ఉన్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. అలాగే జవాన్ల ఆత్మగౌరవాన్ని కాపాడేలా గార్డ్ ఆఫ్ హానర్ గౌరవ లాంఛనాలు కల్పించాలని విన్నవించారు.