'పోలీసుల స్పందన అద్భుతం': సీపీకి ఒడిస్సా వాసి కృతజ్ఞతలు

రిపోర్టర్: గోపి స్థలం: విశాఖపట్నం

ఒడిస్సాకు చెందిన ఓ వ్యక్తి విశాఖపట్నం బీచ్‌ను సందర్శించిన సమయంలో రూ.2,500 పోగొట్టుకోగా, బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన Vizag Police బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన బాధితుడు నగర సీపీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు Vizag Police అధికారిక వివరాలను వెల్లడించారు.