గ్రేటర్ నోయిడాలో బీభత్సం సృష్టించిన కారు నలుగురు విద్యార్థుల గాయాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: Greater Noida
జాతీయ రాజధాని ప్రాంతంలోని గ్రేటర్ నోయిడా పరిధిలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. సెప్టెంబర్ 18న జరిగిన ఈ ప్రమాదంలో వేగంగా వచ్చిన మారుతి ఆల్టో కారు ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న గౌరవ్, ఆయుష్, క్రిష్, మోహిత్ అనే విద్యార్థులను ఢీకొట్టింది. ఈ ఘటనలో గౌరవ్‌కు కాలు విరగగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మనీష్‌ను అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.