భద్రాద్రిలో అపూర్వ వరద బీభత్సం: భారీ వర్షపాతంతో ఉలిక్కిపడ్డ ప్రాంతాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Bhadradri District

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ముప్ పై గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అపూర్వ వరద పరిస్థితి ఏర్పడిందని Telangana Weatherman తెలిపారు. అశ్వారాపేటలో 411.8 మిమీ, మల్కారంలో 397.8 మిమీ, ములకలపల్లిలో 377.8 మిమీ, అంకంపాలెంలో 347 మిమీ, నాయుడుపేటలో 262.6 మిమీ, సత్తుపల్లిలో 201.3 మిమీ చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ఈ విపరీత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.