కూటమి అభ్యర్థులను గెలిపించండి: విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రచారం

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం మండలం సారిక, కోరుకొండ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూటమి అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.