అర్నబ్ తుపాను నష్టపరిహారం వెంటనే చెల్లించాలంటూ బొత్స సత్యనారాయణ డిమాండ్

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయనగరం

అర్నబ్ తుపానుతో నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించాలని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విజయనగరంలోని వైకాపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విపత్తు ముప్పు ముందే తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించడంలో విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా కూటమి ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.