ఇంటి నంబర్ వివాదంపై సీఎస్కు ఆర్టీఐ దరఖాస్తు: ఖమ్మంలో కలకలం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఇప్పుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఇంటి నంబర్పై సమగ్ర వివరాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఆర్టీఐ దరఖాస్తు సమర్పించారు. రికార్డుల మార్పులు, ఫోర్జరీ సంతకాల ఆరోపణలు, అధికారుల చర్యలపై పూర్తి స్థాయి సమాచారాన్ని అందించాలని వారు కోరారు.