అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్
రిపోర్టర్: కిరణ్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారి నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు.