అలిపిరి నడకమార్గంలో చెట్టుపై చిరుత కలకలం
రిపోర్టర్: శివ
స్థలం: తిరుమల
తిరుమల అలిపిరి నడకమార్గంలో భక్తులకు చిరుత పులి ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపింది. 2,765వ మెట్టు సమీపంలో ఓ చెట్టుపై చిరుత కూర్చొని ఉండటాన్ని గమనించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, భక్తుల రక్షణ దృష్ట్యా వారిని గుంపులు గుంపులుగా నడకమార్గంలో ముందుకు పంపిస్తున్నారు. వన్యప్రాణుల సంచారంపై అధికారులు నిరంతరం నిఘా ఉంచారు.