కామారెడ్డి పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Kamareddy
కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు ఎస్పీ కామారెడ్డి తెలిపారు. భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య, డప్పు కళాకారుల సాంప్రదాయ ప్రదర్శనలతో ఈ యాత్ర మరింత సందడిగా సాగుతోందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.