చిలుకూరులో ఎన్ఎస్పీ భూముల ఆక్రమణపై గ్రామస్థుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కట్ట కొమ్ముగూడెంలో ఎన్ఎస్పీ భూములను కొందరు అక్రమంగా ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూమి కళ్లముందే కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.