ఎల్నినో ముప్పుపై ఖమ్మం కలెక్టర్ అప్రమత్తత: తాగునీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు
రిపోర్టర్: రాము
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లాలో ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.