స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.