కొత్తగూడెంలో సీఎంఆర్ ధాన్యం మాయం: కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు నమోదు

రిపోర్టర్: రమేష్ స్థలం: కొత్తగూడెం

కొత్తగూడెంలో సీబీఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కాంగ్రెస్ నేత ఆళ్ల మురళితోపాటు కోపార్ట్నర్ అంజనమ్మపై త్రీటౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పౌరసరఫరాల శాఖ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్ లో సుమారు ఆరు కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై త్రినాథ్బాబు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.