లంచం ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన ఆర్టీసీ అధికారి ఆత్మహత్య

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

తిరుపతి ఆర్టీసీ విజిలెన్స్ సీఎస్ఐ వర్మ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. బదిలీల వ్యవహారంలో 50 వేల లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఆయన గత మే నెలలో సస్పెన్షన్కు గురయ్యారు. ఈ అవినీతిలో నెల్లూరు జోన్ అధికారి ధర్మతేజ పాత్ర కూడా ఉందని వర్మ విచారణలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ప్రజా రవాణా కార్యాలయంలో ఆయన ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోవడం ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.