'భారత్‌లో విద్యా స్వేచ్ఛ తీవ్రంగా పరిమితమైంది': 'ఫ్రీ టు థింక్' నివేదిక

రిపోర్టర్: గోపి స్థలం: భారతదేశం

భారత్‌లో విద్యా స్వేచ్ఛ తీవ్రంగా పరిమితమైందని అంతర్జాతీయ నెట్‌వర్క్ 'స్కాలర్స్ ఎట్ రిస్క్' తాజా 'ఫ్రీ టు థింక్ 2026' నివేదికలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యపై తన అధికారాన్ని విస్తరిస్తూ, విశ్వవిద్యాలయాల పాలనలో జోక్యం చేసుకుంటూ భిన్నాభిప్రాయాలను అణచివేస్తోందని నివేదిక ఆరోపించింది. యూజీసీని రాజకీయ లబ్ధి కోసం వినియోగిస్తున్నారని, దేశంలో అకడమిక్ ఫ్రీడమ్ స్కోర్ గణనీయంగా పడిపోయిందని నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.