అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన మంత్రి సవిత
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పింఛను అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దరఖాస్తుల పరిశీలన సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు అధికారులను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తక్షణమే సస్పెండ్ చేశారు. శనివారం జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆమె, ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో ఎలాంటి అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు.