మురసు తుపాను ప్రభావం: ఏపీలో విస్తారంగా వర్షాలు, నెల్లూరులో విద్యాసంస్థలకు సెలవు

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. నెల్లూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్ లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఇప్పటికే పంట నష్టపోయిన అన్నదాతలు మరో తుపాను ముప్పుతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.