కాకినాడ జిల్లా తాళ్లరేవులో కుండపోత వర్షం
రిపోర్టర్: గోపి
స్థలం: తాళ్లరేవు
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. దీనివల్ల కాకినాడ నుంచి అమలాపురం వెళ్లే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.