మహిళా కండక్టర్ మృతి ఘటన: బాధిత కుటుంబానికి కోటి పరిహారం అందజేత

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మణుగూరు డిపోకు చెందిన ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని వెల్లడించారు. అలాగే ఆర్టీసీ ఇన్సూరెన్స్ మరియు ఎక్స్ గ్రేషియా ద్వారా మొత్తం కోటి రూపాయల ప్రమాద బీమా అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.