ఆరోగ్యకరమైన వృద్ధాప్యమే లక్ష్యంగా ప్రత్యేక అధ్యయనాన్ని ప్రారంభించిన హెర్బాలైఫ్ ఇండియా సంస్థ

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

భారతీయుల్ లో వయస్సు పెరుగుతున్న కొద్దీ జీవన నాణ్యతపై ప్రభావం చూపే అంశాలపై సమగ్ర అధ్యయనం చేపట్టనున్నట్లు హెర్బాలైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఖన్నా తెలిపారు. బెంగళూరు, మైసూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్ లో ఆరు నెలల పాటు కొనసాగే ఈ పరిశోధనలో వెయ్యి మందికి పైగా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లు, శారీరక చురుకుదనం, మానసిక ఆనందం వంటి అంశాలను ఈ అధ్యయనంలో శాస్త్రీయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు.