గోదావరి పుష్కరాలపై ప్రత్యేక ప్రణాళిక: మేడారం తరహాలో ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి పొన్నం
రిపోర్టర్: గోపి
స్థలం: ధర్మపురి
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను మేడారం సమ్మక్క సారక్క జాతర తరహాలో ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రూ.2.57 కోట్ల నిధులతో బస్టాండ్ ఆధునికీకరణ పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు భక్తుల ప్రయాణ సౌకర్యాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటుకు త్వరలోనే స్థల సేకరణ చేపడతామని స్పష్టం చేశారు.