విదేశీ విద్యపై మారిన దృక్పథం: డిగ్రీ కంటే ఉపాధికే విద్యార్థుల ప్రాధాన్యం

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

విదేశీ విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల ఆలోచనా విధానంలో కీలకమైన మార్పు వస్తోందని ఐడీపీ ఎడ్యుకేషన్ నివేదిక వెల్లడించింది. యూనివర్సిటీ పేరు కంటే చదువు పూర్తయ్యాక లభించే ఉద్యోగ అవకాశాలకే విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషకులు తెలిపారు. కఠిన వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు ఉన్నప్పటికీ విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, అయితే భవిష్యత్తు ఉపాధి భద్రతపైనే వారి అడుగులు పడుతున్నాయని సర్వే స్పష్టం చేసింది.