ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు 'కళ్యాణం కమనీయం జీవితం'

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన క్లీన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ 'కళ్యాణం కమనీయం జీవితం'. ఈ నెల 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌ను అభినందించారు. భార్యాభర్తల బంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.