మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా దసరాకు ప్రారంభం
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో హారర్ అండ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమా దసరా పండగ సందర్భంగా పట్టాలెక్కనుంది. సరికొత్త లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.