ఎచ్చెర్లలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన మహిళా ఓటర్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎచ్చెర్ల

ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగేలా చూస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు.