విమానంలో ప్రయాణికుడి వీరంగం డక్ట్ టేప్‌తో కట్టేసిన తోటి ప్రయాణికులు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమెరికా
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో డల్లాస్ నుంచి నెవార్క్ వెళ్తున్న సమయంలో లేన్ ఆర్థర్ లూండిన్ అనే 67 ఏళ్ల వ్యక్తి విపరీతంగా ప్రవర్తించడంతో తోటి ప్రయాణికులు అతడిని డక్ట్ టేప్ మరియు జిప్ టైలతో కట్టేశారు. మద్యం సేవించి విమాన సిబ్బందిపై, ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించిన ఈ ఘటనపై కోర్టులో హాజరైన నిందితుడు తనకు ఏమీ గుర్తులేదని వింతగా సమాధానం ఇచ్చాడు.