పాశ్చాత్య లౌకికవాదం వల్ల ధర్మం మతతత్వంగా కనిపించింది

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

పాశ్చాత్య లౌకికవాదం వల్ల సనాతన ధర్మం మతతత్వంగా మారిపోయిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. భారతదేశంలో మతం, ధర్మం ఒకే అర్థంలో లేవని, ధర్మం అంటే మతం కాదని స్పష్టం చేశారు. మన సంస్కృతి, జీవన విధానాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వాస్తవికతను విస్మరించవద్దని ఆయన హితవు పలికారు.