స్వతంత్ర భారతీయ సంస్థగా నథింగ్ సీఎమ్ఎఫ్ బ్రాండ్
రిపోర్టర్: విజయ్
స్థలం: India
ప్రముఖ టెక్ సంస్థ నథింగ్ తన సబ్ బ్రాండ్ అయిన సీఎమ్ఎఫ్ ను స్వతంత్ర భారతీయ సంస్థగా మారుస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ కార్ల్ పే తెలిపారు. భారత్ లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగానికి ఉన్న అపారమైన వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ తరువాత కూడా నథింగ్ సంస్థ ఇందులో వాటాను కలిగి ఉంటుందని స్పష్టం చేశారు.