సినిమా అప్డేట్: వచ్చే ఏడాది సంక్రాంతికి పా.రంజిత్ వేట్టువం విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: చెన్నై
ప్రముఖ తమిళ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్య, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్ లో నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం వేట్టువం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. గతం, వర్తమానం, భవిష్యత్తు మూడు కాలాలను అనుసంధానిస్తూ సాగే ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఘట్టాలతో పాటు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది.