బాబర్ అజామ్ ఫామ్ కోల్పోవడంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ యూసఫ్

రిపోర్టర్: సతీష్ స్థలం: లాహోర్

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ తన బ్యాటింగ్ లోని సాంకేతిక లోపాలను సరిదిద్దుకునేందుకు ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా దేశాలకు వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని ఆ దేశ మాజీ కెప్టెన్ మొహమ్మద్ యూసఫ్ సూచించారు. దేశీయ క్రికెట్ ఆడటం వల్ల ఆయన ఆత్మవిశ్వాసం మరింత దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన మార్గదర్శకత్వంతో బాబర్ మళ్లీ ఫామ్లోకి వస్తారని యూసఫ్ స్పష్టం చేశారు.