కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: Adilabad
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి రూ. రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వేయికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.