ముంచింగిపుట్టులో పారదర్శకంగా సాగుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ముంచింగిపుట్టు
అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొంతేరి జగత్రాయ్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.