దసరా ప్రయాణికులకు తీపి కబురు: కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్ల సర్వీసులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: వరంగల్

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కాజీపేట మీదుగా పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 25 వరకు సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్నగర్ - హైదరాబాద్ మార్గంలో మొత్తం 34 స్పెషల్ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తెచ్చామని అధికారులు స్పష్టం చేశారు. పండుగ వేళ ఇంటికి వెళ్లే వారికి ఈ ప్రత్యేక రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.