ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదంటూ ఎస్ జైశంకర్ హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూయార్క్

భారత్ ఆందోళనలను భాగస్వామ్య దేశాలు గుర్తించకపోతే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం విషయంలో భారత్ ఒక రెడ్ లైన్ గీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని తేల్చిచెప్పారు. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుందని పరోక్షంగా మండిపడ్డారు. మా ప్రాథమిక ఆందోళనలను విస్మరిస్తే ఆ ప్రభావం కచ్చితంగా సంబంధాలపై కనిపిస్తుందని ఆయన హెచ్చరించారు.