ఎన్నికల వ్యవస్థపై ఉన్న అపోహలు తొలిగాయని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
కేంద్ర ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణతో ఎన్నికల వ్యవస్థపై ఉన్న అపోహలకు తెరపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను ఈసీ మరోసారి చాటిందని తెలిపారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థపై అంతర్జాతీయ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములను నాయకులు హుందాగా స్వీకరించాలని సూచించారు. రాజ్యాంగ సంస్థలపై గౌరవం అత్యంత కీలకమని ఎక్స్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.