తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తమిళనాడు
తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు బడుల్లో హాజరు శాతాన్ని పెంచే లక్ష్యంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. శాకాహారం తినే విద్యార్థులకు యథావిధిగా పౌష్టిక ఆహారం కొనసాగుతుందని, కేవలం మాంసాహారం తినే పిల్లలకు మాత్రమే ఆప్షనల్ ప్రాతిపదికన చికెన్ బిర్యానీ వడ్డిస్తామని స్పష్టం చేశారు.