భారీ వర్షాల కారణంగా మంత్రుల విమానం నాగ్‌పుర్‌కు మళ్లింపు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విశాఖపట్నం
విశాఖ వైపు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం భోగాపురంలో భారీ వర్షాల కారణంగా నాగ్‌పుర్‌కు మళ్లించినట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాత్రి విజయవాడ నుంచి బయలుదేరిన ఈ విమానం రన్‌వేపై దిగేందుకు రెండుసార్లు విఫలమైంది. సుమారు నలభై నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము నాగ్‌పుర్‌కు సురక్షితంగా చేరుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.