రాజాపేట మండలంలో ఘనంగా పద్దెనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు మండల విద్యాధికారి కె. మనోజ్ కుమార్ తెలిపారు. అన్ని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో ఎంఆర్సి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ ఎంపిక చేపట్టామన్నారు. సోమవారం ఎంపికైన గురువులకు ప్రత్యేక సమావేశంలో అభినందన సత్కారంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.