నేలపట్ల వినాయక మండపాన్ని దర్శించుకున్న డీఎస్పీ పి మధుసూదన్రెడ్డి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఏకదంత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామివారిని డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి, సీఐ మన్మధకుమార్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.