నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలను వెల్లడించిన ఎన్బీఈఎంఎస్
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ సంస్థ నీట్ పీజీ 2026 ఫలితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు natboard.edu.in వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలు, స్కోర్‌కార్డులను చూసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను కూడా బోర్డు వెల్లడించింది.