'దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు': రాహుల్ గాంధీ విమర్శలపై బీజేపీ కౌంటర్

రిపోర్టర్: రమేష్ స్థలం: పూణె

దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి ప్రతిపక్షాలు తీవ్ర అశాంతికి గురవుతున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పూణెలో మండిపడ్డారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యూపీఐ ఎండీఆర్ లావాదేవీల ఛార్జీలపై చేసిన ట్వీట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని, ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సును, ఏఐ సదస్సును కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని నితిన్ నబిన్ ఘాటుగా విమర్శించారు.