నెల్లూరు జిల్లాలో ఆటోలు ఢీకొని ఎనిమిది మంది విద్యార్థులకు గాయాలు

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరు వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న ఆటో మరో ఆటోను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది గురుకుల పాఠశాల విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. సచివాలయంలో ఐటీ క్లాస్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని ప్రైవేట్ ఆసుపత్రికి, విద్యార్థులను నెల్లూరు జీజీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.