సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కీలక ఆదేశాలు పాల్గొన్న జేసీ
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
VZM : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎనిమిదో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, డి.ఆర్.ఓ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రకటించడమే కాకుండా, సంక్షేమ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కులవృత్తులకు తగిన వాల్యూ అడిషన్ కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.