పల్నాడులో స్పూర్తిదాయకం: దశాబ్దాలుగా మద్యం నిషేధాన్ని కొనసాగిస్తున్న పదిహేను గ్రామస్థులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా నూజండ్ల మండలంలోని పదిహేను గ్రామాల్లో దశాబ్దాలుగా మద్య నిషేధం ఖచ్చితంగా అమలవుతోంది. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ పెద్దలు కమిటీలుగా ఏర్పడి మద్యం అమ్మకాలు, కొనుగోళ్లపై కఠిన నిబంధనలు విధించుకున్నారు. ఎన్టీఆర్ స్పూర్తి, నాటి పిలుపుతో ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతమై నేటికీ తమ కట్టుబాట్లను భద్రంగా కాపాడుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు.