ఇండియా పోస్ట్ భారీ వృద్ధి: క్యూ2లో 4,201 కోట్ల రూపాయల ఆదాయం
రిపోర్టర్: గోపి
స్థలం: గుంటూరు
ఇండియా పోస్ట్ వార్షిక వ్యాపార ప్రణాళికపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి తాను రెండవ త్రైమాసికం మరియు మొదటి అర్ధభాగం పనితీరును సమీక్షించినట్లు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ - కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ వెల్లడించారు. ఈ త్రైమాసికంలో పోస్టల్ శాఖ ఆదాయం 4,201.5 కోట్ల రూపాయలకు చేరిందని, ఇది గతేడాదితో పోలిస్తే 25.2 శాతం వృద్ధి సాధించిందని ఆయన తెలిపారు. మొదటి అర్ధభాగంలో మొత్తం వసూళ్లు 8,212.7 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని పేర్కొన్నారు.