మత్స్యకారులకు తీపి కబురు: సముద్రంలో చేపల వేటపై ఇన్కాయిస్ ముందస్తు హెచ్చరికలు

రిపోర్టర్: సతీష్ స్థలం: శ్రీకాకుళం

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత కోసం ఇన్కాయిస్ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ అండగా నిలుస్తోందని మత్స్యశాఖ ఏడీ సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారులు సాంప్రదాయ పడవలపై జీవనం సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉపగ్రహాల ద్వారా సముద్ర పరిస్థితులను అంచనా వేసి చేపల లభ్యతపై సమాచారం అందిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాణ, ఆస్తినష్టాలను నివారించవచ్చని అధికారులు వెల్లడించారు.